ఋషివాక్యం సుఖం దేనివల్ల వస్తుంది?

Описание к видео ఋషివాక్యం సుఖం దేనివల్ల వస్తుంది?

కోరిక ఎప్పుడూ అర్హత కాదు.

సుఖదుఃఖాలకు కారణం మనం చేసే కర్మలే.

రమన్తాం పుణ్యా లక్ష్మీర్యాః పాపీస్తా అనీనశమ్’ – చేసుకున్న పుణ్యాల వల్ల ఇంట్లో లక్ష్మి వర్ధిల్లుతూ ఉంది. పాపాల వల్ల దెబ్బతింటున్నాం.

ఏ ఇంట్లో యజ్ఞములు జరుగుతాయో దానిని మంగళకరమైన ఇల్లు అనాలి. యజ్ఞం అనగా ధర్మాచరణ.

భోగాలు అనుభవించడానికో విశ్రాంతి తీసుకోవడానికో వినోదించదానికొ గృహం కాదు. యజ్ఞాచరణకు గృహం.

మలినకరమైన వాతావరణం ఉంటే దుష్టశక్తులు వస్తాయి.
అధర్మంగానైనా సంపాదించి ఇంట్లో వారిని పోషించాలి అనుకుంటూ ఉంటారు. అటువంటి పోషణ ఇంట్లోవారికి ఆరోగ్యాన్ని కలిగించదు.

మంచి పని చేయడానికి ప్రేరణ కర్మ సిద్ధాంతం. ఎక్కడి నుంచో ఏదో వచ్చి పడుతుంది అని చెప్పడం కర్మ సిద్ధాంతం కాదు.

‘సుఖస్య దుఃఖస్య న కోఽపి దాతా పరో దదాతీతి కుబుద్ధి రేషా’ – ఆధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు.
సత్కర్మాచరణ వల్లనే సౌఖ్యం అనేది ఉంటుంది. దుష్కర్మ వల్లనే దుఃఖం అనేది ఉంటుంది కానీ బాహ్యమైన కారణాలు కాదు.

Комментарии

Информация по комментариям в разработке