వ్యాస పౌర్ణమి - Guru Purnima Song | శ్రీ వేదవ్యాస Vedavyasa | Prashanti Chopra, B Ramesh Sarma

Описание к видео వ్యాస పౌర్ణమి - Guru Purnima Song | శ్రీ వేదవ్యాస Vedavyasa | Prashanti Chopra, B Ramesh Sarma

#prashantichopra #telugusongs #devotional #vedavyasa #vyasapurnima #gurupurnima

వ్యాస పౌర్ణమి - Guru Purnima Song
రచన: భారతుల రమేష్ శర్మ
గానం: ప్రశాంతి చోప్రా
Karaoke: Neelakandhara song

వ్యాసదేవరా! పూజ్యగురువరా! పూజలందగా రావా!
నీదు శిష్యులము! నీదు భక్తులము! మమ్ము దీవించరావా!
మహామహితాత్మ! దివ్యచరితాత్మ !యోగపరమాత్మ! దేవా!
నీదుభక్తాళి ! నీదుశిష్యాళి! పుష్పాంజలిని గొనుమా!
పాదపూజలే అందుకొనగ నిను వేడుకొందుము కనుమా!

మూడులోకాలు! నాల్గువేదాలు! ఇలలో!
నిలిచె నీ భారతం-పంచమవేదమై !
సర్వమంత్రాలకే నీవధిపతివై !
పంచభూతాల శక్తులే నీకు వరమై!
జీవాత్మగా! ఓం హర ఓం!
పరమాత్మగా! ఓం హర ఓం!
జీవాత్మగా! పరమాత్మగా!
జ్ఞానమిచ్చి మోక్షమిచ్చు జ్ఞానిగ
వెలుగునొసగితివి ధరనింకా!
హర ఓం! హరహర హరహర!
పూజ్య గురువరా!

సర్వవేదార్ధ సర్వమంత్రార్ధ యతివై!
వెలుగుచిమ్మేవు వేదభాస్కరుడవై !
సకలమంత్రాల సంధానకర్తవే నీవై!
నీవునిలిచేవు జగతికే ఆదిగురువై!
ప్రభవిల్లగా ఓం హర ఓం!
విలసిల్లగా ఓం హర ఓం!
ప్రభవిల్లగా! విలసిల్లగా!
భక్తినిచ్చి శక్తినిచ్చి ముక్తినొసగునది నీవేలే!
హర ఓం! హరహర హరహర!
పూజ్య గురువరా!

నీదురూపమే విష్ణురూపమై వెలుగొందే!
నీదుతేజమే సర్వదేవతల నెలవయ్యే!
నీవు ప్రవచించ రచియించె గణపయ్యే!
మహాభారతం ఆయె ఇతిహాసమై!
వెలుగొందగా! ఓం హర ఓం! భువికందగా ! ఓం హర ఓం!
వెలుగొందగా! భువికందగా!
జగతికెల్ల ప్రగతినొసగిన శ్రీవేదవ్యాస నారాయణా!
హర ఓం! హరహర హరహర!

వ్యాసదేవరా! పూజ్యగురువరా! పూజలందగా రావా!
నీదు శిష్యులము! నీదు భక్తులము! మమ్ము దీవించరావా!
మహామహితాత్మ! దివ్యచరితాత్మ !యోగపరమాత్మ! దేవా!
నీదుభక్తాళి ! నీదుశిష్యాళి! పుష్పాంజలిని గొనుమా!
పాదపూజలే అందుకొనగ నిను వేడుకొందుము కనుమా!
పూజ్య గురువరా!

Комментарии

Информация по комментариям в разработке