పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు || Piduguralla Bypass Road || Vlog || thelerner

Описание к видео పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు || Piduguralla Bypass Road || Vlog || thelerner

పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు || Piduguralla Bypass Road || Vlog || thelerner


పల్నాడు ప్రజానీకానికి ప్రణామములు

పిడుగురాళ్ల పట్టణానికి చాలా కాలముగా పట్టిన పీడ వదిలింది.!

అదే అండి ట్రాఫిక్ సమస్య గురించి చెబుతున్నా..

నా చిన్నప్పుడు 2003 జనవరిలో ఒక అతనికి ప్రమాదం జరిగింది.

గంగమ్మగుడి ప్రక్కన రామ స్టూడియో ఉంది.
దానికి ఎదురుగా ఒకరికి లారీ ఢీకొంది.

నేను విన్న దాని ప్రకారంగా అయితే ఆయన అంతటా ఆయనే స్వయంగా లారీ క్రింద పడి చనిపోయారు అని అన్నారు.

ఆయన శరీరములో ఉన్న భాగాలు అన్ని బయటకు వచ్చాయి

నేను చూసిన అతి భయంకర దృశ్యం అది.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే..

చాలా కాలముగా నిలిచిపోయిన పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు..

నిన్నటి రోజున అనగా 2024 మార్చి 15న పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది.

గౌరవ శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు
ప్రారంభించారు.

పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మనికొన్ని రోజులు పడుతుందని చెప్పారు.

పట్టణం నుండి వెళ్ళే దారిలో పూర్వం చాలా ప్రమాదాలు జరిగాయి.

ఎందరో గాయపడ్డారు.
ప్రాణాలు కోల్పోయారు.

ఈ పరిస్థితి నుండి ప్రధాన రహదారి వలన ప్రజలకు కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది.

కానీ ఇప్పుడు క్రొత్తగా ప్రారంభించిన బైపాస్ రోడ్డు, పిల్లుట్ల రోడ్డు జంక్షన్ ఉంది.

అక్కడ ప్రమాదాలు జరగకుండా,

బైపాస్ రోడ్డు మీద ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన విధంగా పోలీసుల గస్తీ ఉంటే సరిపోతుంది.

పట్టణములో ట్రాఫిక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుంది.

ఇప్పుడు భారీ వాహనాలు టౌన్లోకు రావడం లేదు అని
రోడ్లు కాలిగా ఉన్నాయని
యువత అతివేగంగా డ్రైవింగ్ చేసే అవకాశం లేకపోలేదు.

కావున అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల
మనవి.

అధికారులు పిడుగురాళ్ల పట్టణములో ఇంకా ఏమేమి మార్పులు చేస్తే బాగుంటందని అనుకుంటున్నారో మీ యొక్క అభప్రాయాన్ని కామెంట్ రూపములో తెలుపగలరు.

మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.
అంత వరకు నమస్కారం!!

#piduguralla #piduguralla_bypass_road #thelerner

Комментарии

Информация по комментариям в разработке