Download Budget Analysis Document Here:
https://t.me/Choutiseconomy/2897
#telanganabudget2024 #budget2024telangana #tspscgroup2
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి భట్టి విక్రమార్క 2024-25 వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా..
మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు
ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు.
తెలంగాణ బడ్జెట్ పద్దులు ఇవేః
******************
ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు
ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు
వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
ఉద్యానశాఖకు రూ.737కోట్లు
పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు
గృహజ్యోతికి రూ.2,418కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు రూ.1,525 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు
బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు
వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు
అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు
విద్యకు రూ.21,292 కోట్లు
హోంశాఖకు రూ.9,564కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు
Информация по комментариям в разработке