నెల్లూరు అమరావతి హాటల్ కిచెన్ కలుగులో పందికొక్కులు , ఎలుకలు. ఇదేందయ్యో .

Описание к видео నెల్లూరు అమరావతి హాటల్ కిచెన్ కలుగులో పందికొక్కులు , ఎలుకలు. ఇదేందయ్యో .

అమరావతి హాటల్ కిచెన్ కలుగులో పందికొక్కులు , ఎలుకలు. ఇదేందయ్యో . నెల్లూరులోని మాగుంటలేఔట్ లో అమరావతి హాటల్ పై కార్పొరేషన్ అధికారులు దాడులు చేసిన తరువాత నాన్ వెజ్ హోటల్స్ లో ఫుడ్ అంటేనే వణుకుపుడుతుంది. నాన్ వెజ్ వంటకాల్లో పేరున్న నెల్లూరు పరువుతీసిన ఈ హోటల్ . కిచెన్ చూస్తే వళ్ళు జలదరిస్తుంది. వాంతులొచ్చేస్తాయి. నాన్ వెజ్ అంటేనే వెగటు పుట్టే పరిస్థితి. ఇదిగో ఈ కిచెన్ చూడండి. పందికొక్కులు బొరియలు చేసుకున్నాయి. ఎలుకలు కలుగులో దాగివున్నాయి. పైన పటారం లోన లొటారం అన్నట్టు. పందికొక్కులు, ఎలుకలు వంట గదిలో వస్తువులపై తిరుగాడినా , వాటిపై మూత్ర విసర్జన చేసినా ఎవరూ పట్టించుకోరు. ప్రమాదకరమైన రోగాలొచ్చి జనం లక్షలు ఖర్చుపెట్టుకోవలసిందే. కుళ్ళి వాసన కొడుతున్న మాంసం, చికెన్, రొయ్యలను స్వాధీనం చేసుకొని . కార్పొరేషన్ హెల్త్ అధికారులు కేసుపెట్టి , 50 వేలరూపాయలు ఫైన్ వేశారు. కానీ ఈ కిచెన్ దారుణం చూసిన తరువాత నెల్లూరులో అమరావతి హాటల్ లాంటి హోటళ్లలో ఇంకెన్ని కిచెన్లు ఇలా ఉన్నాయో పరిశీలించాలి. నాణ్యమైన ఆహరం ముసుగులో ఇంత అసహ్యంగా , అపరిశుభ్రంగా హోటల్ నడపటం ప్రజలప్రాణాలతో చెలగాటమాడటమే.. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке