భారతీయ కాలమానం - కనురెప్ప పాటు కాలం నుండి యుగాలు, మన్వంతరాలు దాకా!

Описание к видео భారతీయ కాలమానం - కనురెప్ప పాటు కాలం నుండి యుగాలు, మన్వంతరాలు దాకా!

మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
https://www.youtube.com/ajagava?sub_c...


ఈరోజు మనం మన భారతీయ కాలమానం గురించి చెప్పుకుందాం. అంటే కనురెప్ప పాటు కాలం దగ్గర నుండి యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, బ్రహ్మగారి ఆయుష్షు వరకూ లెక్కలు చెప్పుకుందాం. సాధారణంగా మానవ సంవత్సరాల కాలమానం వరకూ ఎవ్వరి కీ ఏ ఆక్షేపణా ఉండదు. అదే దేవతా సంవత్సరాలు, యుగాలు అనే సరికి కొన్ని ఆక్షేపణలు మొదలవుతూ ఉంటాయి.



కానీ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మన పూర్వీకులైన మహర్షులు అసాధారణ శాస్త్రవేత్తలు. అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించిన విజ్ఞానవేత్తలు. శాస్త్రసాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించామనుకుంటున్న మనం, ఈ శతాబ్దంలో తెలుసుకోగలుగుతున్న ఖగోళ విషయాల గురించి, మన మహర్షులెప్పుడో కచ్చితమైన లెక్కలు వేసి మరీ చెప్పారు.



ఆ తరువాత కూడా ఎందరో పరిశోధకులు మన ప్రాచీన విజ్ఞానవేత్తలు చెప్పిన విషయాలను జ్యోతిషశాస్త్రము, గణితశాస్త్రములను ఆధారంగా చేసుకుని నిరూపించి చూపించారు.మహాభారత యుద్ధం క్రీ.పూ.3138లో కార్తీక అమావస్యనాడు మొదలయ్యిందన్న విషయాన్ని ఖగోళ లెక్కలతో సహా సరి చూపిస్తూ చెప్పిన కోట వెంకటాచలం గారి వంటి మహా పరిశోధకులు సుమారు అరవై ఏళ్ళ క్రితం వరకూ జీవించే ఉన్నారు. జగద్గురు ఆదిశంకరులు జన్మించింది ఇప్పటి పాశ్చాత్యుల లెక్కల ప్రకారం క్రీ.శ. 788లో కాదనీ, ఆయన జన్మించింది క్రీ.పూ. 509లో అనీ, శివైక్యం చెందినది క్రీ.పూ. 477లో అనీ బలమైన ఆధారాలను చూపుతూ వారు నిరూపించారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారివంటి మహారచయితల చారిత్రక రచనలకు కూడా వెంకటాచలం గారి పరిశోధనలే ఆదరువుగా నిలబడ్డాయి.



కనుక, భారతీయుల ఋషులు చెప్పిన ఏ విషయాన్నీ కూడా తేలికభావంతో తీసివేయకుండా, మన పురాణ సంబంధవిషయాల మీద తృణీకారభావం లేకుండా, మన మహర్షులకు నమస్కరించుకుంటూ “కాలమాన” విశేషాల లోకి ప్రవేశిద్దాం.



#RajanPTSK #Kaalamaanam #UnitOfTime

Комментарии

Информация по комментариям в разработке