ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంది సామీ. okkasari raavaalani sami yennalluga pilustunti

Описание к видео ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంది సామీ. okkasari raavaalani sami yennalluga pilustunti

ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి సామీ

మధ్యమావతి రాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా

పల్లవి

ఒక్కసారి రావాలని సామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి సామీ
వేడివేడి అన్నములో వెన్నుపూసనే వేస్తా
ఆవకాయ వడ్డించి పక్కనుండి తినిపిస్తా
" ఒక్కసారి రావాలని స్వామీ"

చరణం 1

పండ్లు నీకు పెట్టేందుకు శబరమ్మను కాను నేను
ఫలహాలిచ్చేందుకు మహారాజును కానయ్యా
పేదింటి వంట తింటే పేరేమి తరగదులె
గొంగటిలో కూర్చుంటే గొప్పేమి తరగదులె
"ఒక్కసారి రావాలని సామీ "

చరణం 2

పూల పరుపు వేసేందుకు దొరల బిడ్డ కానయ్య
గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయా
అరుగుమీద కూకుంటా తొడమీద ఒరుగు సామి
తలను కాస్త నిమురుతుంటా నిదురపో నా సామి
"ఒక్కసారి రావాలని సామీ "

చరణం 3

పిడికెడన్ని అటుకులకే పొంగిపోయి నా వంట
పడవనిన్ను దాటిస్తే పరిశించి నావంట
ఎంతటి దయగల వాడో వేంకటేశు డనుకుంటీ
అంతటి నా సామి నీవు.... మా ఇంటికి రావేమి
"ఒక్కసారి రావాలని సామీ "

Комментарии

Информация по комментариям в разработке