ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని|YERIGI YUNNANAYA|

Описание к видео ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని|YERIGI YUNNANAYA|

ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని

మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని

నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||

మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||


KEYS :DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RHYTHMS :PAUL CHAITHANYA
TABLA : SUVARNA PUVVALA
CAMERA :RAVI KAKADA
RECORDED @ IMPACT LIVE STUDIO, VIZAG
CONTACT US ON : 9849415733

VENUE : IMPACT STUDIO,KAKINADA

PRODUCTION MANAGEMENT :
APARNA DANIELRAJ YARLAGADDA

Комментарии

Информация по комментариям в разработке