#CBC

Описание к видео #CBC

ఏ లేలో ఏలో ఏలో హైలెస్సా.....
గేన్నసరేతు తీరమున యేసు నిలచి యున్నాడు
జాలరులు తమ వలలను కడుగుచున్నారు (2)...
సీమోను తన దోనె ను లోని తోయమన్నాడు
ఆ దోనె లో కూర్చొని భోదించ సాగాడు (2)
1. సీమోనును దోనేను లోనికి నడుపుమన్నాడు
వల వేసి చేపలను పట్టమన్నాడు (2)
రాత్రి అంతా మేము కలసి శ్రమా పడ్డాము
అయినను మాకేమీ దొరక లేదన్నాడు (2)
అయిన నీ మాట చెప్పన వల వేసేదం అన్నాడు (2)
ఏ లెలో ఏ లో ఏ లో హైలెస్సా....
2. యేసు మాట చెప్పున వల వేశారు
విస్తారమైన చేపలతో వలలు పెగిలెను (2)
యేసు నీ దోనే లో ఉంటే అన్నీ సాధ్యమే
యేసుకు నీ హృదయం ఇస్తే గెలుపు తద్యమే (2)
యేసు నీ ఇంటిలో ఉంటే ఎంతో ఆనందమే
నేడు యేసు నీ ఎదలో ఉంటే ఎంతో సంతోషమే(2)
ఏ లే లో ఏ లో ఏ లో హైలెస్సా.....
లుకా:5:1-7
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,

2. ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.

3. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.

4. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా

5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.

6. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా

7. వారు వేరొక దోనె లోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

Комментарии

Информация по комментариям в разработке