Nandyala Famous Ravi Gari Karam Dosa | Pudina Dosa | Ghee Karam Dosa | Nandyal | Food Book

Описание к видео Nandyala Famous Ravi Gari Karam Dosa | Pudina Dosa | Ghee Karam Dosa | Nandyal | Food Book

రైలు బండి లయబద్ద సవ్వడులతో సాగిన ప్రయాణం. పొడవైన బోగద సొరంగం గుండా ఇక్కడే పుట్టిన గుండ్లకమ్మ ప్రవాహం వలే వడివడిగా ముందుకు సాగుతూ ఆంగ్లేయులు నిర్మించిన దొర బావి వంతెన సమీపాన కీకారణ్యంలోకి వెళ్లగా నల్లమల గిరులపై విరబూసిన ప్రకృతి సోయగం మదిని మీటి పరవశమైంది.వీచే చల్లని సమీరాలు హాయిని,లేలేత సూర్య కిరణాలు ఆహ్లాదాన్ని కురిపించగా
అపరూప మనోరంజకమైనది ఈ పయనం.

నవ నందుల పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న నంద్యాల ఆధ్యాత్మిక సౌరభాలకు, ప్రకృతి అందాలకు నెలవు.

ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆహార పదార్థాలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆపార ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం. నమస్కారం. నాపేరు లోక్ నాధ్ .

నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో ఉంటుంది రవి కుమార్ గారు రెండు దశాబ్దాలుగా నిర్వహణ చేస్తున్న అల్పాహార శాల.శుచికరమైన ఉపాహారాలు రుచికరంగా వడ్డిస్తూ మంచి గుర్తింపు పొందారు వారు.

తొలుత ముడి పిండిని కొద్దిగా నూనెతో ఒద్దిక చేసి ఆపైన పుదీనా మరియు క్యారెట్ తురుము విరజార్చి వెంబడి ఎర్రకారం రాసి ఆనక పప్పుల పొడి అద్ది చివరిన ఉల్లిపాయలు చేర్చి మరికాస్త దొరగా కాలేందుకు నూనె ఉపకరించగా సిద్ధమైన దోశ వీక్షణంతో ఎర్రటి వర్ణంలో కాంతి వంతంగా ఆహార సద్గుణం ప్రదర్శితమైంది.ఆ దోశను పచ్చడికి అద్ది తింటుంటే లభించింది సంప్రదాయ మేలిమి రుచి.ముఖ్యంగా మిత్రత దోశకు బాగా కుదిరింది జోడింపులతో.రుచి సమీకరణలో వివిధ ముడి పదార్థాలు మరియు రవి కుమార్ గారి తయారీ ప్రావీణ్యం ప్రాముఖ్యం.


అల్పాహారశాల గూగుల్ లొకేషన్:- https://g.co/kgs/yKRhFN

Комментарии

Информация по комментариям в разработке