వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి భావగీతము

Описание к видео వేయబోవని తలుపు తీయమంటూ పిలుపు - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి భావగీతము

పట్రాయని సంగీతరావుగారికి దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారితో 1943 లో కాకినాడలోనే పరిచయం ఏర్పడింది. కొద్దికాలం విరామంతో ఆ పరిచయం మద్రాసులో మరింత బలపడింది. కృష్ణ శాస్త్రిగారు రచించిన ఎన్నో గీతాలను సంగీతరావుగారు స్వరపరిచారు. కొన్ని గీతాలను కూచిపూడి నృత్యరూపకాలలో కూడా సందర్భానుగుణంగా ఉపయోగించారు. వారి అమ్మాయి పద్మావతితో ఈ గీతాలను పాడించి కృష్ణశాస్త్రిగారికి వినిపించేవారు.

పద్మావతి 1985-86 సం. లో ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రంలో లలితగీతాలను ఆలపించారు. వారి మామగారు కొచ్చెర్లకోట సూర్యప్రకాశరావుగారు ఆకాశవాణిలో మ్యూజిక్ కంపోజర్ గా ఉండేవారు. వారి వాద్య సంగీత నిర్వహణలో పద్మావతి ఆలపించిన లలిత గేయాలలో ఈ గీతం కూడా ఉంది.

ఈ గేయాన్ని పట్రాయని సీతారామశాస్త్రిగారి సంప్రదాయం ప్రకారం ముందు ఒక రాగంలో పద్యం పాడడం, తరువాత అదే రాగంలో గీతాన్ని ఆలపించడం అనే పద్ధతిని పాటించారు.
కృష్ణ పక్షము పద్య సంకలనం లోని కృష్ణాష్టమి శీర్షికన కనిపించే శారదశర్వరి పద్యాన్ని, వేయబోవని తలుపు గీతాన్ని పహాడి రాగంలో స్వరపరిచారు సంగీతరావుగారు.

Комментарии

Информация по комментариям в разработке