నక్క వంచన | తెలుగు కధలు | Moral Stories | Inspirational stories l motivational stories l

Описание к видео నక్క వంచన | తెలుగు కధలు | Moral Stories | Inspirational stories l motivational stories l

నక్క వంచన | తెలుగు కధలు | Moral Stories | Inspirational stories l motivational stories l నీతికథలు | Telugu Kathalu | Stories in Telugu | Telugu Moral Stories |

అదొక మహారణ్యం, ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు స్వేచ్చగా, యదేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక తెలివైన నక్క కూడా ఉంది . అందరిచేత అది పనులు చేయించుకుని, పని పూర్తవ్వగానే అందర్నీ మోసం చేస్తూ ఫలితాన్ని తనే అనుభవిస్తూ గడిపేది.
ఈ నక్క బావ కి నలుగురు మిత్రులు ఉన్నారు. పులి, తోడేలు,ముంగిస, ఎలుక ..వీళ్ళతో సరదాగా స్నేహం నటిస్తూ కాలక్షేపం చేస్తున్న నక్కకి ఒక రోజు పిక్క బలిసి,నవ నవలాడే లేడి పిల్ల చెంగు చెంగున ఎగురుతూ, దూకుతూ కనిపించింది. ఆ లేడి ఈ మిత్ర బృందాన్ని చూసి వీళ్ళనుంచి హాని కలుగుతుందేమో అని దూరం గా పారిపోయింది. ఈ లేడి పిల్ల ని ఎలాగైనా తినాలన్న కోరిక కలిగింది నక్కకి.లేడి పిల్లని పట్టుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసింది నక్క. కాని ఎప్పటికప్పుడు నక్క బారి నుంచి లేడి పిల్ల తప్పించుకుంటూ తనని తాను రక్షించుకుంటోంది.
నక్క బాగా అలోచించి, ఇది నా ఒక్కరివల్ల కాదు, మిత్రుల సహకారం తీసుకోవాల్సిందే అనుకుని మిత్రులైన పులి,ఎలుక, ముంగిస, తోడేలు తో సమావేశం అయింది.
మిత్రులారా ఆ లేడి ని చూసారా! ఎంత అందంగా ఉందో, దాని మా౦సం రుచి కూడా భలే ఉంటుంది. కాకపొతే దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. దాని వెనుక పరిగెత్తే శక్తి మనకి ఎవరికీ లేదు, దాన్ని చంపడం అసాధ్యం. కనుక దాన్ని చంపి రుచికరమైన దాని మాంసాన్ని తినాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, అది మనం అమలుచేస్తే దాని మాంసాన్ని కడుపారా ఆరగించవచ్చు అని నోరు చప్పరించింది. మిత్రులకు కూడా నోరు ఊరింది, నక్క బావ చెప్పింది చేస్తే ఎంతో రుచికరమైన లేడి మాంసాన్ని తినవచ్చు అని ఆశపడ్డారు మిత్రులు. దాంతో ఉపాయం అమలుచెయ్యడానికి ‘సిద్దం’ అని చెప్పాయి.
అయితే వినండి అంటూ మొదలుపెట్టింది నక్క
లేడి మెలుకువగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అది అలిసిపోయి నిద్రపోయే సమయాన్ని మనం కనిపెట్టాలి. ఆ సమయంలో ఈ ఎలుక చప్పుడు చేయకుండా పాకుతూ వెళ్లి దాని కాళ్ళు కోరికిపారేయాలి, అదే సమయం లో పులి వెళ్లి లేడి మెడ విరిచి పడేయాలి అంతే అంది నక్క బావ
ఓస్ ఇంతేనా! మేము సిద్దం అన్నారు మిత్రులు...నువ్వు చాలా తెలివి గలదానివి, ఎంత చక్కని ఉపాయం చెప్పావు అని పొగిడారు మిత్రులు
పచ్చికబయళ్ళ మద్య తిరుగుతూ, పచ్చిక తింటూ, సెలయేరు నీరు తాగుతూ, గెంతుతూ అలసిపోయిన లేడి కాళ్ళు బార్లా జాపుకుని నిద్రకుపక్రమించింది. అదే అదనుగా చూస్తున్న ఎలుక పాకుతూ వెళ్లి కాళ్ళను కోరికేసింది, ఇంతలో పులి దూకుడుగా వెళ్లి లేడి మెడ విసిరేసింది. దాంతో లేడి నేలకోరిగిపోయి చచ్చిపోయింది.
అప్పుడానక్క శభాష్ మిత్రులారా! నా ఉపాయాన్ని బాగా అమలుచేసారు, కాని ఇంత రుచిగల మాంసాన్ని తినాలంటే, శుబ్రత ఉండాలి, దుమ్ము ధూళితో మీ శరీరాలు కంపు కొడుతున్నాయి, చక్కగా ఏటిలో స్నానం చేసి రండి, శుచిగా సంతోషంగా ఈ లేడి మాంసాన్ని ఆరగిద్దాం అంది.
అలాగే అంటూ మిత్రులు నలుగురూ స్నానానికి వెళ్లారు
స్నానం చేసి పులి లేడి మాంసాన్ని తినాలని పరుగు పరుగున వచ్చింది.
నక్క బావ ఏడవటం మొదలుపెట్టింది. అది చూసి పులి, ఎందుకు నక్కబావా ఏడుస్తున్నావ్? ఏమైంది అని అడిగింది .
ఏం చెప్పను పులి బావా! ఈ ఎలుక ఏమన్నదో తెలుసా నీ గురుంచి. గంభీరంగా ఉండే పులిబావ కూడా లేడి ని ఏమీ చెయ్యలేకపోయాడు, ఎంత పెద్ద జంతువైతే ఏమి లాభం. నేను వెళ్లి ఆ కాలు కొరికితే గాని లేడిని ఏమి చెయ్యలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని పులి ఎలా తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వాగింది. చాలా భాద కలిగింది మిత్రమా అందుకే ఏడుస్తున్నా అని కన్నీళ్లు కార్చింది.
పులికి పౌరుషం పొడుచుకు వచ్చింది. ఎలుక నా కళ్ళు తెరిపించింది, నా శ్రమతో, శక్తితో సంపాదించుకున్నదాన్నే నేను తింటాను. ఒకరి మీద ఆధారపడను, ఈ లేడి మాంసం వద్దు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
అంతలో ఎలుక వచ్చింది
చూడు ఎలుక బావా ముంగిస ఏమంటుందో తెలుసా! ఈ లేడిమెడని పులి కొరికింది, అందువల్ల ఈ లేడి మాంసం విషమైపోయింది. కాబట్టి లేడి మాంసం నేను తినను ఆ ఎలుక వస్తుంది కదా! దాన్ని తినేస్తా అంటోంది అనగానే ఎలుక తనని రక్షించుకోడానికి కలుగులోకి పారిపోయింది.
మరి కొంతసేపటికి తోడేలు వచ్చింది, ఆ పులిబావ నిన్ను తినడానికే సిద్దం అవుతోంది, తన భార్యతో వచ్చి నిన్ను ఆరగిస్తానంటో౦ది అనగానే తోడేలు అక్కడ నుంచి పారిపోయింది.
అప్పుడు ఆశగా లేడి మాంసం తినడానికి ఒచ్చింది ముంగిస ...
ముంగిసా! ఆగు. ఎలుక, తోడేలు, పులిని నేను చంపి దూరంగా పడేసాను ..నీకు శక్తి ఉంటే ఇప్పుడు ఈ లేడి మాంసం తినాలంటే నన్ను ఓడించు అంది. అంతే ముంగిస తోక ముడుచుకొని పారిపోయింది.
తెలివితో, వంచనతో పనులు చేయించుకున్న నక్క హమ్మయ్య! అంటూ హాయిగా ఆ లేడి మాంసాన్ని ఆరగించింది నక్క.

**************************************************************************

#moralstories
#moralstory
#moralstoriesintelugu
#childrenstorieswithamoral
telugustories
#telugukadhalu
#stories
#telugu
#story
#storyintelugu

Комментарии

Информация по комментариям в разработке