మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK

Описание к видео మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK

ఎక్కువకాలం జీవించినవారెవరు?

అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. వాళ్ళు ద్రౌపదీ సమేతులై అనేక వనాలు తిరుగుతూ కామ్యకవనం చేరుకున్నారు. అక్కడ ఉండే మునులు, బ్రాహ్మణులు ధర్మాత్ములైన పాండవులను ఎంతగానో ఆదరించసాగారు. అలా కాలం గడుస్తుండగా ఒకసారి శ్రీకృష్ణపరమాత్మ సత్యభామతో కలిసి పాండవులను చూడడడానికి కామ్యకవనం వచ్చాడు. ఆ దంపతులను చూడగానే ద్రౌపదీ, పాండవులు పొంగిపోయారు. కౌగిలింతలు, కుశలప్రశ్నలు అయ్యాక కృష్ణుడు పాండవులతో వారి బలం గురించి, వారి మిత్రపక్షాల బలం గురించి వివరించి, ధర్మం తప్పక జయిస్తుందంటూ ధైర్యం చెప్పాడు. బావా నువ్వుండగా మాకు లోటేమిటి.. మేమంతా నీకు దాసులం. నువ్వెలా అంటే అలా నడుచుకుంటాం అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడికి పరమభక్తితో నమస్కరించాడు. అలావారంతా ఊసులు చెప్పుకుంటూ ఉండగా అక్కడకు మార్కండేయ మహర్షి వచ్చాడు. వేలకొద్దీ సంవత్సరాల వయసున్న ఆ మహానుభావుడు చూడడానికి మాత్రం కేవలం ఇరవై ఐదు సంవత్సరాలవాడిగా కనిపిస్తాడు. ఆ మహానుభావుడికి పరమేశ్వరుని కటాక్షంతోపాటూ, సుదీర్ఘమైన జీవితానుభవం కూడా ఉండటం వల్ల, ఆయనకు తెలియని విషయం లేదేమో అన్నట్లుగా ఉండేది. అటువంటి మునీశ్వరుడు రావడంతో శ్రీకృష్ణుడు, పాండవులతో సహా ఆ ప్రదేశంలో నివసించే మునులంతా కూడా ఎంతో సంతోషించారు. అందరూ ఆ మార్కండేయుని భక్తి శ్రద్ధలతో సేవించారు. అప్పుడు శ్రీకృష్ణుడు మార్కండేయునితో.. “మహర్షీ! మీరు ఎన్నో తరాలను చూసినవారు. వేరెవ్వరికీ లేనంత లోకానుభవం కలవారు. దయచేసి మాకు ప్రాచీన రాజుల చరిత్రల్ని, మహాతపస్సంపన్నులైన ఋషుల గాథల్ని, గొప్పవారైన స్త్రీల కథల్నీ చెప్పండి. అలానే సత్సంప్రదాయాల గురించి కూడా వివరించండి అని అభ్యర్థించాడు. దానితో ఆ మార్కండేయుడు వారందరికీ బోలెడన్ని వృత్తాంతాలను ఎంతో ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆ సమయంలో పాండవులు మార్కండేయుడితో “మహాత్మా! ఇన్ని విషయాలను కళ్ళకు కట్టినట్లు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఆనందంతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతోంది. మాకో చిన్న సందేహం. మీకంటే ఎక్కువ కాలం జీవించినవారిని మీరెక్కడైనా చూశారా” అని అడిగారు. అప్పుడు మార్కండేయుడు “చూశాను నాయనల్లారా. ఆ కథ చెబుతాను వినండి” అంటూ ఇలా చెప్పసాగాడు.

Комментарии

Информация по комментариям в разработке