Ballari Famous Cycle PalaKova | 82 Years Famous Palakova| Traditional Sweet | Bellary | Food Book

Описание к видео Ballari Famous Cycle PalaKova | 82 Years Famous Palakova| Traditional Sweet | Bellary | Food Book

బళ్లారి సైకిల్ కోవ కై సంప్రదింగలరు:- 6360193209,8867293039.

సుమనోహర దృశ్యాలు తన్మయత్వంతో సమ్మోహనపరచగా సుమాలించే ఎన్నో స్మృతులతో మదిలో అందంగా భూషితమై ఉంది ఈ పయనం.

నూతన ప్రదేశాలకు వెళ్లాలని.అక్కడి రుచులను నేను ఆస్వాదించి మీకు పరిచయం చేయాలన్నది నా అభికాంక్ష. తదానుగుణంగా సాగింది మా ఆహార విహారం కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి నగరానికి.

ఈ విహారాన..
నా అనుభూతులను మీతో పంచుకొబోతున్నాను.

తొలుత గా మానవతా మూర్తి పునీత్ రాజ్ కుమార్ గారికి నివాళి.

బళ్లారి చరిత గల ధాత్రి. భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో వకటైన విజయనగర రాజ్యం యొక్క రాజధాని హంపీ.బళ్లారికి సమీపంలో ఉంటుంది.

ప్రపంచంలోనే రెండవ పెద్దదైన ఏకశిలా కొండ ఇక్కడ కలదు.ఆగిరిపై నగరంలో నలుదిశలకు కనిపించే కోట బళ్లారి చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
బళ్లారి గుడ్డగా పిలిచే ఆ కోటను ఎగువ, దిగువ భాగాలు విభజించగా ఎగువ కోటను హనుమప్ప నాయక,దిగువ కోటను హైదర్ అలీగార్లు నిర్మితం చేసినట్లు గ్రంధాలలో నిక్షిప్తమై ఉంది.

అప్పటి మద్రాస్ రాష్ట్రంలో దత్త మండలం అలానే సీడెడ్ అని పిలవబడిన ప్రాంతంలో రాయలసీమతో కలసి బళ్లారి ఉండేది.
ఈ నేపథ్యంలో ఇక్కడి వారు మాతృ భాష కన్నడతో పాటు తెలుగు మాట్లాడగలరు.

కన్నడ చలనచిత్రాలతోపాటు తెలుగు చలనచిత్రాలను సైతం విశేషంగా ఆదరిస్తారు.

ముఖ్యంగా ఈ ప్రాంత వాసులు ఎంతో సహృదయులు.సాటివారి తో ఆత్మీయంగా ఉంటారు.

అట్టి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వంటకాల గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.


బళ్లారిలో ప్రసిద్ధి చెందిన రుచుల కొరకై అంతర్జాలంలో శోధన చేసిన స్థానికులను వివరణ అడిగిన తొలుత గా వచ్చే సమాధానం గత 82 ఏళ్లగా ఈ ప్రాంత వాసులకు తియ్యదనం పంచుతూ
మధుర చరిత్ర సొంతం చేసుకున్న సైకిల్ పాలకోవా మాధుర్యం గూర్చి.

ఏ పండగైన, శుభకార్యామైన సైకిల్ కోవా తోనే నోరు తీపి చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తారు బళ్లారి వాసులు.అంతలా అమితంగా ఇష్టపడతారు.

మానవీయ భావాలు వ్యక్తపరిచేందుకు వారధిగా నిలిచిన ఈ మిఠాయికి ఆధ్యులు గుడె సాహెబ్ గారు.వారిది బళ్ళారి కీ సమీపాన గల ఓ గ్రామం.ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి
పాక శాస్త్రంలో ప్రావీణ్యులయ్యారు.

నూతన వంటకాలను తయారు చేయడంలో ప్రసిద్ధులైన ఆయన.ఆ పరంపరలో పాలకోవాకు ప్రత్యేక వర్ణం, కమ్మనైన మధుర రుచి వనగూర్చి ఇస్తరాకులో అందిస్తూ ఘన కీర్తిని లిఖిత పరుచుకున్నారు.సైకిల్ మీద విక్రయంచే వారు కనుక సైకిల్ కోవాగా ప్రాచుర్యం పొందింది.

గుడే సాహెబ్ గారి తదుపరి వారి కుమారులు ఆ తరువాత వారి మనవళ్ళుతో పాటు ముని మనవళ్ళు సైతం వారసత్వాన్ని పునికిపుచ్చుకుని ఉమ్మడిగా పాలకోవాని నాణ్యత,వైవిధ్యమైన రుచి తో అందిస్తూ తమ కీర్తి ని కొనసాగిస్తున్నారు.

పాలకోవా కి సమున్నతి చేకూరాలంటే స్వచ్ఛమైన పాలు వారికే తెలిసిన తయారీ సూత్రంతోపాటు ఓపిక ఎంతో అవసరం.ప్రత్యేకమైన అంతికమీద గంటల తరబడి పాలు కాస్తూ ఆసాంతం ధర్వి తో కదంభించాలి.అలా చేస్తేనే వాస్తవిక సద్గుణం ఓనగూరుతుంది.

కోవా ఏ మాత్రం పొడిగా ఉండదు.కాస్త తడిగా ,ఇసుమంత గుల్లదనంతో పుట్టతేనె వలే ఉండు పాకాన్ని నింపుకుని ఉంటుంది.అట్టి పాలకోవా ని నోటికి అందించగా కోమలమైన కోవా రూపాంతర రేణువులు అద్భుతమైన అమృతసారాన్ని విరజల్లడంతో జిహ్వానికి మధుర రసభరిత రుచి లభిస్తుంది. ఆ ఆస్వాధన మదిని తాకుతుంది.

Комментарии

Информация по комментариям в разработке