మహాకవి దాశరథి గారి కవిత్వ పరిచయము - Mahakavi Dasarathi gari Kavitva Parichayamu

Описание к видео మహాకవి దాశరథి గారి కవిత్వ పరిచయము - Mahakavi Dasarathi gari Kavitva Parichayamu

మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
https://www.youtube.com/ajagava?sub_c...


“ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని
తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”

అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు. మనంకూడా ముందుగా విప్లవాగ్ని రగిల్చే ఆయన కవిత్వంలో కాసేపు కణకణలాడి, ఆ తరువాత ఖుషీ ఖుషీగా నవ్వుకుంటూ - చలాకి మాటలు రువ్వుకుంటూ - హుషారుగొలిపే ఆయన సినీ సాహిత్యంలో తడిసి చల్లబడదాం.

#RajanPTSK #Dasarathi #Dasaradhi

Комментарии

Информация по комментариям в разработке