ప్రభుత్వ సేవలు గట్లుంటే.. ప్రజలు పన్నులు గిట్లనే కడతరు | Dr. JP with

Описание к видео ప్రభుత్వ సేవలు గట్లుంటే.. ప్రజలు పన్నులు గిట్లనే కడతరు | Dr. JP with

#swatantrabharatavajrotsavam #Loksatta25 #jayaprakashnarayana
#azadikaamritmahotsav2022

"లోక్ సత్తాను ప్రారంభించినప్పుడు యూనియన్, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రెండూ కలిపి మొత్తంగా ఒక్కో పౌరునిపై ఏటా రూ.5000 ఖర్చు చేసేవి. ఇప్పుడు ఆ మొత్తం రూ.57,000 కు పెరిగింది. కానీ ప్రభుత్వం తాను చేయాల్సిన పనుల్ని సక్రమంగా చేసి ఆ డబ్బుకు తగ్గ ఉమ్మడి సేవల్ని సరిగా అందించకపోవడం వల్ల పౌరులు పన్నుల చెల్లింపు పట్ల విముఖతతో ఉన్నారు, తాయిలాల్ని కోరుకుంటున్నారు. దీనివల్ల ట్యాక్స్ ల పరిధి కూడా తగిన రీతిలో విస్తరించటం లేదు. అవినీతి నల్లడబ్బు సమస్యని, సాధారణ పౌరుల్లో పన్నుల పట్ల వ్యతిరేకతని వేరుగా చూడాలి. పన్నులు కట్టటం నాగరిక లక్షణం. పన్నుల డబ్బు లేకుండా ఉమ్మడి సేవలు కల్పించటం కష్టం. ప్రభుత్వం తాను చేయాల్సిన పనుల్ని సక్రమంగా చేయటం, హేతుబద్ధీకరణతో పన్నుల సంస్కరణలను తీసుకురావటం, సమాజంలో పన్నుల పట్ల స్పృహను పెంచటం చేస్తే.. పౌరులు తాత్కాలిక తాయిలాలు అడగకుండా సంతోషంగా పన్నులు చెల్లిస్తారు" అని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ 'స్వతంత్ర భారతం 75 - లోక్ సత్తా 25'పై విద్యావేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత ఆకెళ్ల రాఘవేంద్రతో ఎపిసోడ్ (Part-2)లో అన్నారు.

ప్రజాస్వామ్య దేశమైనా సామాన్య ప్రభుత్వోద్యోగికి- సామాన్య ప్రజలకు మధ్య అంతరం మన దేశంలో విపరీతంగా ఉండటం, మధ్యతరగతి బలంగా రూపుదిద్దుకోకపోవటం, ప్రభుత్వాలకు మద్యం ఆదాయమార్గమై పేదల జీవితాలతో చెలగాటమాడుతుండటం, వేగంగా విస్తరిస్తున్న
డ్రగ్స్ పై విధానపర వైఫల్యం, FDR/లోక్ సత్తా భవిష్యత్ కార్యాచరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇండియా-2047 రోడ్ మ్యాప్ మొదలైన అంశాలపై ఈ ఎపిసోడ్ లో JP వివరించారు.

Комментарии

Информация по комментариям в разработке