Neelone Anandham ||Br. AMRUTHARAO garu||Telugu Christian Songs 2024

Описание к видео Neelone Anandham ||Br. AMRUTHARAO garu||Telugu Christian Songs 2024

#youtube #jesuschrist #jesussaves #youtubeshorts #dance #jesuscristo #likeforlikes #subscribe #videoupload #youtuber
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో.. ఏడారులలో..
సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో..
అగ్ని స్తంభమై నను నడుపుమయా…
||దీవించావే ||

1.నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)

ఊహలలో.. నా ఊసులలో..
నా ధ్యాస బాసవైనావే..
శుద్ధతలో.. పరిశుద్ధతలో..
నిను పోలి నన్నిల సాగమని..
|| దీవించావే ||


2.కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)


ఆశలలో.. నిరాశలలో..
నేనున్నా నీకని అన్నావే..
పోరులలో.. పోరాటములో..
నా పక్షముగానే నిలిచావే..
|| దీవించావే ||

Комментарии

Информация по комментариям в разработке