పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి? | Pothuraju story | Rajan PTSK | Ajagava

Описание к видео పోతురాజు ఎవరు? అతని ఏడుగురు అక్కలైన గ్రామదేవతల కథేమిటి? | Pothuraju story | Rajan PTSK | Ajagava

మన ఊర్లలో పోలేరమ్మ, మావుళ్ళమ్మ మొదలైన గ్రామదేవతలకు జాతర్లు జరుగుతున్నప్పుడు ఆ యా దేవతలతో పాటూ పోతురాజుని కూడా పూజించడం చూస్తుంటాం. మన జానపదసాహిత్యంలో కూడా మనకీ పోతురాజు పేరు వినబడుతూనే ఉంటుంది. ఇంతకీ ఈ పోతురాజెవరు? గ్రామదేవతలుగా అనేకచోట్ల పూజలందుకునే అతని అక్కలెవరు? అసలు వారి పుట్టుక వెనుకనున్న ఆసక్తికరమైన కథేమిటి? మొదలైన విషయాలను ఈరోజు మన అజగవ సాహితీ ఛానల్ లో చెప్పుకుందాం.

మన పురాణవాఙ్మయంలో కానీ, రామాయణభారతాలలో కానీ పోతురాజు కథకు సంబంధించిన ఆధారాలు కనబడవు. కానీ జానపదుల నోళ్ళలో వందల సంవత్సరాలుగా నానుతూ ఈ కథలు చిరంజీవత్వాన్ని సంపాదించుకున్నాయి.
ఈ కథే కాదు, మనం పూజించే గ్రామదేవతలకు సంబంధించిన కథలుకానీ, అయ్యప్పస్వామి, కన్యకాపరమేశ్వరీ వంటి ప్రసిద్ధ దేవతల కథలుకానీ మనకు పురాణాలలో కనబడవు. ఈ కథలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే గ్రంథస్థం చేయబడినవి. వీటిలో కొన్ని కథలకు లిఖితపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. అంతమాత్రం చేత మన గ్రామదేవతల ప్రాశస్త్యానికి గానీ, మనకు వారిపై ఉండే భక్తిభావానికి గానీ వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా! పరిశోధక పరమేశ్వరులైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "క్రీడాభిరామం" పీఠికలో వ్రాసిన విషములే ఈ వీడియోలో చెప్పబడిన కథకు ఆధారం. ప్రభాకరశాస్త్రిగారీ కథను ఆదిలక్ష్మీ విలాసం, కామేశ్వరీ చరిత్ర అను గ్రంథములనుండి సేకరించారు.

- రాజన్ పి.టి.ఎస్.కె
#pothuraju #ajagava #GramaDevathalu

Комментарии

Информация по комментариям в разработке