అందమైన అమ్మాయిని చిత్రంగా వర్ణిస్తూ చెప్పిన చమత్కార పద్యం!

Описание к видео అందమైన అమ్మాయిని చిత్రంగా వర్ణిస్తూ చెప్పిన చమత్కార పద్యం!

మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
https://www.youtube.com/ajagava?sub_c...


ఈరోజు ఒక సరదా చాటు పద్యం చెప్పుకుందాం. ఒక అందమైన అమ్మాయిని చిత్రంగా వర్ణించే పద్యమిది.

కన్యకు నైదు జంఘలును కన్యకు నారు కుచంబు లెన్నగా
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నేడు విశాల నేత్రముల్
కన్యకు ద్వాదశంబు నులికౌనును కల్గు సులక్షణాఢ్య కా
కన్యకు నీకు నింక పది కావలె కస్తూరి రంగనాయకా!

ఈ పద్యం అర్థం ఏమిటంటే… ఒక కన్యకు ఐదు జంఘలు అంటే ఐదు పిక్కలు ఉన్నాయట. అలాగే ఆరు వక్షోజాలు, నాలుగు కన్బొమలు, ఏడు విశాలమైన కళ్ళు, పన్నెండు నడుములు ఉన్నాయట. ఇటు వంటి లక్షణాలు కలిగిన ఆ కన్య చాలా లక్షణమైనదని అంటున్నాడు ఈ పద్యం వ్రాసిన కవిపుంగవుడు. నిజానికి ఈ వర్ణన ప్రకారం ఒక స్త్రీ ఆకారాన్ని ఊహించుకుంటేనే మనకు భయం కలుగుతుంది. మరి కవేమో సలక్షణవతి అంటున్నాడు. అంటే ఈ పద్యంలో ఏదో మర్మం ఉందన్న మాట. ఈ పద్యంలో మర్మం, చమత్కారం తెలుసుకోవాలంటే, ముందుగా మనం మన జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన రాశీచక్రంలో ఉన్న రాసుల పేర్లు, వాటి వరుస తెలుసుకోవాలి.

సులభంగా అర్థం కావడం కోసం… రాశీచక్రాన్ని వేసి చూపిస్తున్నాను.

మన రాశీచక్రంలో 12 రాశులు ఉంటాయి.అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.ఈ పద్యం అంతా ఈ పన్నెండు రాశులలో ఆరవదైన కన్యారాశి చుట్టూ తిరుగుతుంది.మన లెక్కలన్నీ ఈ కన్యారాశి నుండి కాబట్టి, కన్యను ఒకటిగా లెక్క చూపిస్తూ పద్యం యొక్క అర్థాన్ని వివరిస్తాను.

#RajanPTSK #Chatuvulu #Ajagava

Комментарии

Информация по комментариям в разработке