ఆడ మళయాళం హాస్య నవల | జంబలకిడిపంబ సినిమాకు స్ఫూర్తి | aada Malayalam| Jamabalakidi pamba| Rajan PTSK

Описание к видео ఆడ మళయాళం హాస్య నవల | జంబలకిడిపంబ సినిమాకు స్ఫూర్తి | aada Malayalam| Jamabalakidi pamba| Rajan PTSK

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. ఆధునిక తెలుగు సాహిత్యానికి మార్గదర్శివంటివారు మన కందుకూరి వీరేశలింగం పంతులుగారు. రాజశేఖర చరిత్ర, నీతిచంద్రిక, ఆంధ్రకవుల చరిత్ర ఇలా ఎన్నో ప్రసిద్ధమైన వందకుపైగా పుస్తకాలు రచించినవారాయన. వాటిలో ఒక ఉత్తమస్థాయి హాస్య రచన సత్యరాజా పూర్వదేశ యాత్రలు. ఈ కథంతా ఆత్మకథ బాణీలో సరదాగా సాగుతుంది. ఈ నవల రెండు బాగాలుంటాయి. ఒకటవది ఆడుమళయాళం. దీనినే ఆడమళయాళం అని కూడా కొందరు పలుకుతుంటారు. రెండవది లంకాద్వీపము. ఈ రెండు ప్రదేశాలకు సత్యరాజా ఎలా వెళ్ళాడు? అక్కడ ఏ ఏ వింతలు చూశాడు? మొదలైన విశేషాల సమాహారమే ఈ నవల. వీరేశలింగంపంతులుగారి సృష్టి అయిన ఆడమళయాళం అన్న మాట ఈనాటికీ జనాలనోళ్ళలో నానుతూనే ఉంది. సుమారు 30 ఏళ్ళ క్రితం వచ్చిన జంబలకిడిపంబ సినిమా కథకి ఈ ఆడుమళయాళం కథ స్ఫూర్తేమో అన్నట్లుగా ఉంటుంది. ఇక ఈ నవలలో రెండవభాగమైన లంకాద్వీపానికి జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్ ట్రావెల్స్ ప్రేరణ. సత్యరాజా చేసిన ఈ యాత్రలలో ఆడమళయాళం యాత్రా విశేషాల గురించి ఈరోజు చెప్పుకుందాం.

Rajan PTSK

Комментарии

Информация по комментариям в разработке