మనవి మనకి అర్థం కావు !🤔

Описание к видео మనవి మనకి అర్థం కావు !🤔

భారతీయ సాహిత్యాన్ని అర్థం చేసుకోండి...సంస్కృతిని కాపాడండి.!
పాశ్చాత్య ప్రపంచపు మోజులోపడి భారతీయ సాహిత్యాన్ని సంస్కృతిని విస్మరించకండి. భారతీయులంతా ఇతర దేశాల వేష భాషలను,ఆహారపు అలవాట్లను,ఆచారవ్యవహారాలను అనుకరిస్తే మంచిదని క్షణమైనా అనుకోకండి.!
-- స్వామి వివేకానంద....
మన సాహిత్యం,సంస్కృతిలో ఉన్నంత అమూల్య సంపద మరే ఇతర సంస్కృతిలోనూ లేదన్నది నానిశ్చితాభిప్రాయం.!
కానీ దాని విలువను మనం సరిగా గుర్తించడంలేదు. మన సంస్కృతిని మనం అనుసరించక పోయినట్లైతే ఒక జాతిగా మనం ఆత్మహత్య చేసుకుంటున్నట్లే.
-- మహాత్మా గాంధీ...
ఓ భారతీయ బిడ్డలారా! మీ జాతి గత వైభవాన్ని చరిత్రను విస్మరించక ఆరాధించండి. భారత దేశాన్ని మించిన మరో దేశం,సాహిత్యం చరిత్ర పుటల్లో కనిపించదు. ఎందరెందరో శ్రేష్ఠ వనితలకు ఆలవాలమైనది ఈ భారత భూమి. చరిత్రను తిరగేసినా,ఈ సాహిత్యాన్ని పరిశీలించినా ఎందరో మహాను భావులకు జన్మనిచ్చిన వీరభూమి. వారి తాలూకు చిహ్నాలు శాశ్వతాలుగా ఈ భూమి యందు ఎన్నటికీ నిలిచే ఉంటాయి.
--- సోదరి నివేదిత.... మనం,మనల్ని,మన జీవితాన్ని,మన కుటుంబాన్ని,చివరికి మనకు సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలనన్నిటిని కూడా తేలిగ్గా తీసుకోవచ్చు.కానీ మన దేశాన్ని, భారతదేశ సాహిత్యాన్ని, సంస్కతిని, మన వారసత్వ సంపదని మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.!
ఈ అలసత్వం... సమాజ వినాశనానికి కారణమవుతుంది.!
దేశ సమగ్రతను దెబ్బ తీస్తుంది.శతాబ్దాల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రానికి శరాఘాతం అవుతుంది.!
🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке