బత్తాయి సాగులో 80 టన్నులు | High Yields by Organic Citrus Cultivation |Anji Reddy | 99482 55544

Описание к видео బత్తాయి సాగులో 80 టన్నులు | High Yields by Organic Citrus Cultivation |Anji Reddy | 99482 55544

నల్గొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డి 20ఏళ్లుగా బత్తాయి తోట సాగు చేస్తున్నారు. ఆబ్కారీ శాఖలో సూపరింటెండెంట్ గా పదవీ విరమణ పొందిన ఆయన... అంజనీ శ్రీ నేచురల్‌ ఫామ్ పేరుతో 20 ఎకరాల్లో పండ్లు, కూరగాయల మొక్కలు, వరి సాగు చేస్తున్నారు. సుభాష్‌ పాలేకర్‌ స్ఫూర్తితో రెండేళ్లుగా ఘనజీవామృతం, ద్రవజీవామృతంతో ప్రకృతి విధానంలో మొక్కలకు పోషకాలు అందిస్తున్నారు. చీడపీడలు, తెగుళ్ల నివారణకూ సహజ పద్ధతిలో తయారు చేసిన కషాయాలనే పిచికారీ చేస్తున్నారు. భూసారాన్ని పెంచేందుకు గోవ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. బత్తాయితో పాటు నిమ్మ, సపోటా, అరటి, మునగ, వరి, కూరగాయలు కూడా ఈ క్షేత్రంలో సాగు చేస్తున్నారు. నల్గొండజిల్లాలో కొత్తగా బత్తాయి సాగు ప్రారంభించాలనుకునే రైతులు రంగాపూరు బత్తాయి అంటు మొక్కలు నాటుకోవాలని అంజిరెడ్డి సూచిస్తున్నారు.
anji reddy
99482 55544

Комментарии

Информация по комментариям в разработке