Only 1/- Rs Unlimited Meals | 1 Rupee Meals In Andhra Pradesh | రూపాయి భోజనం| Markapuram | Food Book

Описание к видео Only 1/- Rs Unlimited Meals | 1 Rupee Meals In Andhra Pradesh | రూపాయి భోజనం| Markapuram | Food Book

జాలి లేని విధిరాత తో జీవన దీపం అల్లలాడుతూ పుటగడుపుకునేందుకు పున్నిళ్ళైన దొరకని వారే కాదు.నిత్యం పంచభక్ష పరమాన్నాలు తినగల వారు సైతం ఏదొక సందర్భంలో ఆకలి రుచి నెరిగిన వారే.

జాగు అయినను, నడి రేయు జామైనను భుక్తి పొందగల యోగ్యత ఉన్న వారికీ ఆకలి జీవక్రియలో వేళకు అయ్యే భావన మాత్రమే.ఏ ఆదరణ, ఆదరువు లేక పుటకు పెట్టేడన్నం దొరకని వారికీ మాత్రం ఆకలి జీవన్మరణ సమస్య.

ఆకలి యందు అందురూ సమానమే కానీ.అది విధించు శిక్ష కు కాదు.

ఆకలి తో అలమటిస్తూ నిస్సత్తువతో దీనంగా ఆపన్న హస్తం కోసం ఎదరు చూస్తున్న సాటి మనిషిని అక్కున చేర్చుకుని అన్నం పెట్టి ఆయువు నిలిపే దాయార్ద హృదయులకు ఈ ముఖంగా పాదాభివందనం తెలుపుతూ స్వాగతం. నమస్కారం. నా పేరు లోక్ నాధ్.

ఆకలిగున్న పేగులకు బుక్కెడు బువ్వనందించి ఈ చిన్నారి వ్యక్తం చేస్తున్న చిరుదరహాసానికి,తాత గారి ఆనందానికి మరెందరికో ఆకలి తీరడానికి కారణం కన్నతల్లిపై కన్న బిడ్డకున్న అపారమైన, అనంతమైన ప్రేమానురాగం.

భౌతికంగా దూరమైన తమ మాతృమూర్తి గత స్మృతులు పదిలపరుచుకోవాలన్న ఆ తనయుడి కాంక్ష,అతని ఉదాత్త సహృదయత మార్కాపురం లో రూపాయి కే భోజనం అందించే మహత్కార్యానికి శ్రీకారమైంది.

అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ. మూగ జీవాలను ఆదరించే ఆదర్శమూర్తి.మార్కాపురం కు చెందిన బత్తుల వసుదేవి గారు
ఏడాది క్రితం కాలం చేశారు.

తమ మాతృమూర్తి స్మృత్యర్ధం బత్తుల ఫౌండేషన్ పేరిట సేవా సంస్థ ప్రారంభించిన వసుదేవి గారి కుమారుడు నాగార్జున రెడ్డి గారు విరివిగా సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న వారికీ బాసటగా నిలుస్తున్నారు.

కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్న వారినీ ఆదుకోవాలని భావించిన నాగార్జున రెడ్డి గారు.మార్కాపురంలో ఏ వక్కరు ఆకలితో పస్తులు ఉండ కూడదన్న మానవీయ దృక్పథంతో
రూపాయి కే భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేసారు.

సాటి మనిషి క్షుద్బాధ తీర్చడం దైవ కార్యక్రమంగా భావించిన నాగార్జున రెడ్డి గారు. కార్యోన్మోకుడై స్వల్ప వ్యవధిలో ఆహారశాలను నిర్మించారు. పాక శాస్త్రం లో అనుభవజ్ఞులైన వంట వారిని నియమించుకుని, మన్నిక గల ముడి సరుకులు ఆయా ఆహారాల తయారీకి వినియోగిస్తూ భోజనం అత్యంత నాణ్యంగా ఉండేలా అలానే ప్రతి రోజు ప్రత్యేక వంటకం ప్రజలకు వడ్డించేలా రూపకల్పన చేసి తిన్నవారు సంతృప్తి, ప్రాప్తత వ్యక్తం చేసేలా వ్యవహరిస్తున్నారు.

అమ్మ ఙ్ఞాపకార్ధం రూపాయి కే తిన్నంత భోజనం అందిస్తూ తమ సేవ నిరతి ని చాటుతూ ప్రజల హృదయాల్లో మానవతా మూర్తిగా నిలిచిన నాగార్జున రెడ్డి గారు.తద్వారా భౌతికంగా దూరమైన అపూర్వమైన అమ్మతనాన్ని హృదయాంతరాలలో పదిల పరుచుకుంటున్నారు.


తమ అభిమాన నాయకుడు వై.యెస్ .రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రూపాయికే వైద్యం అందించిన వైనాన్ని స్ఫూర్తి గా తీసుకునాన్నని తెలిపిన నాగార్జున రెడ్డి గారు ఆహారశాల నిర్వహణ తో వచ్చు ప్రతి రూపాయి నిరుపేద విద్యార్థులకు ఆర్ధిక ప్రోత్సాహం గా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ధనిక, పేద బేధమేమి లేదని. రూపాయి లేకున్నా ఆహార శాలకు వచ్చిన ప్రతి వక్కరికి కడుపునిండా భోజనం వడ్డించడమే తమ అంతిమ లక్ష్యమని అన్నారు.1 Rupee Meals

Комментарии

Информация по комментариям в разработке