Only Rs.5/- Unlimited Meals | Unlimited Meals Free In Andhrapradesh | Giddalur | Food Book

Описание к видео Only Rs.5/- Unlimited Meals | Unlimited Meals Free In Andhrapradesh | Giddalur | Food Book

ఏ ఆదరణ , ఆదరువు లేని సాటి మనిషి యొక్క స్థితి...పూటకు పట్టెన్నం దొరకని దయనియస్థితి.
ఈ క్షణాన ఆకలిగుందని చేయు చాచి ఆర్ధించే ప్రాణాలు, ఆకలి తీర్చమని చేయిచాచలేక అలమటిస్తున్న ఊపిరులు ఎన్నో .

ఆకలి విధించిన శిక్ష తో అలమటిస్తూ విడుస్తున్న ప్రాణాలు కొన్ని అయితే,మూర్తీభవించిన ధాతృత్వంతో పలువురు చేస్తున్న అన్నదానంతో ఆకలి తీర్చుకుంటూ ఊపిరి నిలుపుకుంటున్నవారు కొందరు.

నిరుపేదల కడుపునింపుతున్న మానవతా మూర్తులకు ఈ ముఖంగా పాదాభివందనం తెలుపుతూ స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.అవును సూక్ష్మ చిత్రం లో అనగా తమనైల్ లో మీరు చదివింది నిజమే.ఐదు రూపాయలకే కడుపునిండా భోజనం,ఆ ఐదు రూపాయలు లేకున్నా పరవాలేదు.తిన్నంత భోజనం, ఉచితంగా వడ్డిస్తారు గిద్దలూరు లోని ఈ భోజన శాల లో.నేను తెలపడం కాదు గత మూడు సంవత్సరాలు గా ఇక్కడ భోజనం చేస్తున్న ఈ తాత గారు భోజన శాల గూర్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పుడు.

దైవం మనుష్య రూపేణా:తాత గారి ఆకలి తీర్చి వారి ఆశీస్సులు అందుకుంటున్న కామూరి రమణా రెడ్డి గారు ఈ ఆహార శాల నిర్వాహకులు.వారిది ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం బావినేని పల్లి .నిరుపేద రైతు కుటుంబ నేపథ్యం గల రమణా రెడ్డి గారు తమ చిరు ప్రాయంలోనే ఎన్నో కష్టాలను చూశారు.పూట గడవడమే క్లిష్టమైన పరిస్థితితులను అనుభవించారు.ఆ సమయాన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కంకణబద్ధులైన రమణా రెడ్డి గారు కృషి, పట్టుదలతో ఉన్నత విద్యలను అభ్యసించి అహరహం శ్రమించి
ఇప్పుడు ప్రముఖ విత్తన వ్యాపారిగా ఎదిగారు.సామాజిక స్పృహ కలిగిన ఆయన తన వంతుగా సమాజ సేవ లో బాగస్థున్ని కావాలని భావించి తమ కుమారుడు పేరిట మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా అన్న దాన కార్యక్రమాలు విరివిగా చేస్తూ గిద్దలూరు ప్రాంతంలో అన్నదాతగా ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు.

తమ చిన్నతనంలో పుట గడవడమే కష్టమైన సందర్భంలో రమణా రెడ్డి గారు పస్తులున్న రోజులెన్నో.ఆకలి విధించిన శిక్ష అనుభవించిన వ్యక్తి,ఆకలి విలువ తెలిసిన వారు కనుక గిద్దలూరు లో భోజన శాల ఏర్పాటు చేయాలని భావించి 2018లో తన అభిమాన నాయకుడు వై.యెస్. రాజశేఖర్ రెడ్డి గారి పేరిట రాజన్న ప్రజా భోజన శాలను ఏర్పాటు చేశారు.కేవలం5 రూపాయాలకే నాణ్యమైన భోజనం అందిస్తూ అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు.

భోజన నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడరు.మన్నిక గల ముడి సరుకులు వన్ క్లిక్ నిత్యావసర వస్తువుల సరఫరా సంస్థ ద్వారా, ప్రొద్దుటూరు నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటారు.పాక శాస్త్రం లో నైపుణ్యం గల శ్రీనివాస్ రెడ్డి గారు నిత్యం ఎంతమంది భోజనానికి వచ్చిన వొంటి చేత్తో రుచి శుచితో వండి ఆప్యాయంగా వడ్డిస్తారు.

ఇక్కడ 5రూపాయలు ప్రాముఖ్యం కాదు.ఓ బాధ్యత మాత్రమే.ధనిక, పేద బేధమి మి లేదు ఇక్కడ. ఈ ఆహార శాలకు వచ్చిన ప్రతి వక్కరికి కడుపునిండా భోజనం వడ్డించడమే వీరి అంతిమ లక్ష్యం.

యందరో ఆకలి తీర్చుతున్న కామూరి రమణా రెడ్డి గారు అభినందనీయులు.


#Unlimited MealsRs5/-only
#Giddalur
#Foodbook

#Giddalurfamousfood
#GiddalurRajasthanhotel
#Giddalurauntyhotel
#Giddalur amoushotels
#Giddalurnews
#Giddalurnewstoday
#Giddalurvideos
#Giddalurshortfilms
#Giddalurrailwaystation
#Giddalurghatroad
#Giddalursagileru
Streetfoods
#chikenbiryani
#FoodBook
#fiverupeesmealsintelangana
#5chennairslunch
#UnlimitedMealsFreeInAndhrapradesh
#5rslunch,
#5rslunchdelhi
#freemealsingidallur
#ghmc5rupeesmeals

Комментарии

Информация по комментариям в разработке