సినారె చమక్కులు | CiNaRe | C. Narayana Reddy | సి.నా.రె | Rajan PTSk | Ajagava

Описание к видео సినారె చమక్కులు | CiNaRe | C. Narayana Reddy | సి.నా.రె | Rajan PTSk | Ajagava

హాయిగా నవ్వించే సి.నా.రె ఛలోక్తులు

“నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర”
అంటూ మొదలుపెట్టి సువిశాల విశ్వంభరను తన అక్షరాలలో మనకు సాక్షాత్కరింపజేసి, తెలుగు పాఠకలోకం ప్రణమిల్లుతుండగా, తాను జ్ఞానపీఠమెక్కిన కవితా ఘన జగజెట్టి మన సింగిరెడ్డి నారాయణరెడ్డి.
పగలే వెన్నెలలు కురిపించి జగములను ఊయలలూగించినా, రాక్షస స్త్రీతో చాంగురే బంగారు రాజా అంటూ హొయలు ఒలకబోయించినా, గున్నమామిడి కొమ్మమీదున్న రెండు గూళ్ళ గురించి బాలమిత్రులతో ముద్దుముద్దుగా పలికించినా, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం అని ప్రబోధించినా, నల్లని రాళ్ళలో దాగిన కన్నులకోసం, బండల మాటున మ్రోగిన గుండెలకోసం వివరించినా, వస్తాడు నా రాజు ఈరోజు అంటూ విరహగీతాలు ఆలపింపజేసినా, ఎంతటి రసికుడవో తెలిసెరా అంటూ కవ్వింపు నాట్యాలు చేయించినా, సుయోధన సార్వభౌముడితో చిత్రం భళారె విచిత్రం అంటూ యుగళగీతం పాడించినా, తాండ్రపాపారాయుడికి అభినందన మందారమాలలు వేయించినా, వటపత్రశాయికి వరహాలలాలి పాడుతూ జోకొట్టి నిద్రబుచ్చినా అది సినారె గారికే చెల్లుతుంది. అందుకే..
ఆ పెదవి మెదిపితే ఆణిముత్తెపు జల్లు
ఆ కలము కదిపితే అందాల హరివిల్లు
అయన కలం “బంగారు కడ్డి”
అయన పేరు “నారాయణరెడ్డి”
అంటూ సినారె గారి గురించి మృదుమధురంగా కవితాగానం చేశారు మన మధురకవి కరుణశ్రీ గారు. జగమెరిగిన నారాయణరెడ్డి గారి, పాటల్లో మెరుపుల గురించి, మనం ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అందుకే ఈరోజు ఆయన మాటల్లో విరుపుల కోసం కాసింత చెప్పుకుందాం. ఇక ఈనాటి సినారె చమక్కుల్లోకి ప్రవేశిద్దాం.
Rajan PTSK

#RajanPTSK #Humour #CNaRe #Ajagava

Комментарии

Информация по комментариям в разработке