Srinivasa kalyanam Pelli Patalu V. S. Lakshmi

Описание к видео Srinivasa kalyanam Pelli Patalu V. S. Lakshmi

ముందుగా ఇంత అధ్భుతంగా రచించి స్వరపరిచిన విన్నపాముల సామ్రాజ్య లక్ష్మి మా మేనత్తగారికి శతకోటి వందనాలు.

Rachanah&Music:V.S.Lakshmi garu
sung by ChaturvedulaSobha& RadhikaSubramanyam

Ragam : Madyamavathi
Thalam: Chapu.


శ్రీమహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకుకల్యాణ
వైభోగమూ నేడు పెండ్లి శుభముహుర్తము

ముత్యాల పందిరై గగనమే నిలిచేను
నవరత్నపీఠమై భూదేవి నిలిచేనూ
నిత్యకల్యాణమై పచ్చతోరణమై
కల్యాణమండపము కమనీయము...

పెండ్లి కొమరునిబంధు బలగమేదనుచూ
గగనరాజు నిలిచే స్వాగతము పలుకా
పద్మభవుడు వాణి శివపార్వతులతో
ఇంద్రాది దేవతలు తరలివచ్చేరు....

ఎదురుకోలునిలిపి వరపూజలుసేయ
పెండ్లివారిని స్వాగతించేరు
పునుగుజవ్వాది చందన గంధములు
పన్నీరు జల్లులులతో మురిపించేరు...

మంగళవాద్యములు మారుమ్రోగంగా
వీనులవిందుగా వేదమంత్రములు
అందాలమాతల్లి అలమేలుమంగకు
మాంగల్యధారణ మహనీయముగ జరిగే....

పచ్చని తలంబ్రాలు ఝల్లులై కురియ
కెంపులు నీలాలుజాలువారంగ
శ్రీ వాణి శ్రీగౌరి హరతులుబట్టి
మంగళగీతములు మధురముగ బాడె...

#pellipatalu #kalyanamsong #madhyamavati #wedingsong #samprdayapatalu#

Комментарии

Информация по комментариям в разработке